Monday, December 23, 2024

బుద్ధుని మార్గంలో తెలంగాణ ప్రభుత్వం పయనిస్తుంది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Gautam buddha jayanti

 

హైదరాబాద్: గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుద్ధుని బోధనలను స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసా మార్గాలు నేటికీ అనుసరణీయమైనవని సిఎం అన్నారు. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా వుందన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిఢవిల్లిందని కెసిఆర్ పేర్కొన్నారు. కృష్ణానది ఒడ్డున ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో నాగార్జున సాగర్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనం’ బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లనున్నదన్నారు. సర్వ జన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనాలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుని మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News