Wednesday, January 22, 2025

అలా చేస్తే జైస్వాల్‌పై ఒత్తిడి పెరుగుతుంది: గంభీర్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్‌ను అభిమానులు, మీడియా, క్రికెట్ పండితులు ఆకాశానికిఎత్తుతున్నారు. దీంతో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించారు. అతడి ఆటను ఆడుకొనివ్వండి, అతడిపై ప్రశంసలు ఎక్కువ కురిపిస్తే ఒత్తిడి పెరిగి సహజత్వాన్ని కోల్పోతాడని సూచించాడు. గతంలో కొందరి ఆటగాళ్లపై మీడియా ఎక్కువ చేసి చూపించడంతో అంచనాలు అందుకోలేక కెరీర్‌లో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.

రెండో టెస్టుల్లో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లు బాగానే ఆరంభించినప్పటికి పెద్ద స్కోర్లు మలచలేక చతికిల పడ్డారని పేర్కొన్నారు. ఇద్దరు గాడిలో పడటానికి కొంచెం సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శుభ్‌మన్, శ్రేయస్ అయ్యర్ అత్యుత్తమైన బ్యాటర్లు అని, వారికి మరి కొన్ని ఛాన్స్‌లు ఇవ్వాలని సెలక్షన్ కమిటీని కోరారు. గతంలోనూ ఇలానే పుంజుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పేలవ పామ్ ఉన్నప్పుడు వాళ్లకు మద్దతు ఇస్తే పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గౌతమ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News