Monday, December 23, 2024

హార్దిక్‌పై గంభీర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలర్ల విషయంలో హార్దిక్ తీరును తప్పుపట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి బౌలర్‌గా పేరున్న యజువేంద్ర చాహల్‌పై హార్దిక్ చిన్నచూపు చూడడం తనను ఆశ్యర్యం కలిగిస్తుందన్నాడు.

సొంత గడ్డపై అద్భుత రికార్డును కలిగిన చాహల్‌తో కిందటి మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించడం తనను బాధించిందన్నాడు. అంతేగాక హార్దిక్ బౌలింగ్‌ను ప్రారంభించడంపై కూడా గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లతో బౌలింగ్‌ను ప్రారంభిస్తే బాగుంటుందన్నాడు. అంతేగాక సిరీస్‌లో బౌలర్లను హార్దిక్ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News