- Advertisement -
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. తన పర్యవేక్షణలో టీమిండియా భారత్ తోపాటు విదేశాల్లోనూ సిరీస్లు గెలుచుకోవడం చాలా గొప్ప విషయమని రవిశాస్త్రి ఓ ఇంటర్వూ సందర్భంగా పేర్కొన్నాడు. అంతేకాదు, విదేశాల్లో సిరీస్లు గెలువడం.. 1983 ప్రపంచకప్ సాధించినదాని కంటే గొప్ప గెలుపని అన్నాడు. దీంతో గంభీర్, రవిశాస్త్రీ వ్యాఖ్యలను తప్పుపట్టాడు. రవిశాస్త్రి సొంత డబ్బకే పరిమితమయ్యాడని, అతను కోచ్గా ఉన్న సమయంలో భారత్ ఒక్క ఐసిసి ట్రోఫీ కూడా సాధించలేదనే విషయాన్ని మరువకూడదని గంభీర్ ఫైరయ్యాడు.
Gautam Gambhir slams Ravi Shastri
- Advertisement -