Sunday, December 22, 2024

చిందులేసే వారి నడ్డీలు విరగొట్టండి

- Advertisement -
- Advertisement -

ముంబై : డాన్స్‌లకు దిగిన ఆ మందను నడ్డిలు విరగొట్టండని మహారాష్ట్ర మైనార్టీ మంత్రి అబ్దుల్ సత్తార్ నిండు సభలో హుకుం జారీ చేశాడు. ఇది పూర్తిగా వివాదాస్పదం అయింది. ఈ మంత్రి పుట్జినరోజు సందర్భంగా బుధవారం రాత్రి సిల్లోడ్ టౌన్‌లో వేడుకలు జరిగాయి. ఇందులో డాన్సర్ గౌతమి పాటిల్ ప్రదర్శన ఏర్పాటు అయింది. సిల్లోడు ఎమ్మెల్యేగా ఉన్న ఈ మంత్రి బర్త్‌డేకు విశేష ఆదరణ ఉండే గౌతిమి పాటిల్ డాన్స్ ఉండటంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

ప్రదర్శన మధ్యలో ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వెలువడటం, కొందరు రెచ్చిపోయి గంతులకు దిగారు. దీనితో ఆగ్రహించిన మంత్రి మైక్ పట్టుకుని వారిని సముదాయించారు. అయితే ఫలితం లేకపోవడం పోలీసులు లాఠీచార్జి జరపాలని, దొరికినోళ్లను దొరికినట్లు చితకబాదాలని , కాళ్లు విరగగొట్టాలని ఆదేశించారు. ఈ ఘటన వైరల్ అయింది. దీనిపై విపక్ష నేత , యుబిటికి చెందిన అంబదాస్ డాన్వే స్పందించారు. మంత్రి అయి ఉండి సత్తార్ ఈ విధంగా హుంకరించడం ఆయన నైజాన్ని మొత్తం షిండే వర్గం దురహంకారాన్ని చాటుతుందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News