Thursday, January 23, 2025

సత్యం గెలుస్తుంది: నిపుణుల కమిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీ

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదాన్ని దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఎం సప్రే సారథ్యంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అదానీ గ్రూపుచైర్మన్ గౌతమ్ అదానీ స్వాగతించారు.

నిర్ణీత కాల వ్యవధిలో సుప్రీంకోర్టు ఈ వివాదానికి ముగింపు పలకగలదని గౌతమ్ అదానీ గురువారం పేర్కొన్నారు. సత్యం గెలుస్తుందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ నిపుణుల కమిటీలో ఓపి భట్, స్టిస్(రిటైర్డ్) జెపి దేవ్‌దత్, నందన్ నీలేకని, కెవి కామత్, సోమశేఖరన్ సెందరసన్ ఉన్నారు. నిపుణుల కమిటీ సీల్డ్ కవర్‌లో తన నివేదికను రెండు నెలల్లో సమర్పించాలని కూడాసుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News