Sunday, January 5, 2025

తాత కృష్ణకు నివాళులర్పించిన గౌతమ్, సితార

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టాలీవుడ్ హీరో మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార ఘట్టమనేని పద్మాలయా స్టూడియోస్‌లో తమ తాత కృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. సితార, గౌతమ్ పద్మయాల స్టూడియోస్‌కు చేరుకుని తమ తాతయ్యకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నటుడి పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు.

వారితో పాటు మహేష్ బాబు, నమ్రత ఉన్నారు. కృష్ణ ఆకస్మిక మరణం యావత్ చిత్ర పరిశ్రమను, అతని అభిమానులను షాక్ కు గురిచేసింది. కృష్ణ అంతిమ నివాళులు అర్పించేందుకు పలు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు పద్మాలయ స్టూడియోస్‌కు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News