Wednesday, January 22, 2025

త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్..

- Advertisement -
- Advertisement -

గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి కథానాయికలుగా సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్3గా ఓ చిత్రం రూపొందుతోంది. పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికి మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మిస్తున్న మూడో చిత్రమిది. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఒక స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి కథ ఇది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం అలరిస్తుంది. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తాం’ అని అన్నారు.

Also  Read: కత్తి దూసిన ప్రేమ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News