Wednesday, December 25, 2024

నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు..

- Advertisement -
- Advertisement -

CM Jagan Condolences to demise of Goutham Reddy

హైదరాబాద్: ఎపి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లాకు తరలించారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ఆయన భౌతికకాయాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించనున్నారు. నెల్లూరులోని నివాసంలో కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఈరోజు రాత్రి యూఎస్ నుంచి మేకపాటి గౌతమ్ కుమారుడు అర్జున రెడ్డి నెల్లూరుకు రానున్నాడు. దీంతో బుధవారం ఉదయంగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగునున్నాయి.

Gautham Reddy’s boby shitf to Nellur from Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News