Sunday, December 22, 2024

అహింసా మార్గంలో పయనిస్తున్న: యాసీన్ మలిక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తాను అహింసా మార్గంలో పయనిస్తున్నానని జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు యాసిన్ మలిక్ తెలిపాడు. 1994 నుంచే హింసను విడిచిపెట్టినట్లు స్పష్టం  చేశాడు. ఐక్య, స్వతంత్ర కశ్మీర్ కోసం తాను గాంధేయ మార్గంలో పయనిస్తున్నానని చెప్పాడు. కాగా మలిక్ ఆయుధాలు వదిలిపెట్టినప్పటికీ ఇప్పటికీ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

1990లో శ్రీనగర్ లోని రావల్ పొరాలో భారత వైమానిక దళానికి చెందిన నలుగురు సైనికుల హత్య కేసులో యాసిన్ మలిక్ ప్రధాన నిందితుడు. నాటి ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా మరణించాడు. ఆ దాడిలో మరో 22 మంది గాయపడ్డారు. ప్రస్తుతం యాసిన్ మలిక్ తీహార్ జైలులో ఉన్నాడు. కాగా జెకెఎల్ఎఫ్-వై ని చట్టవిరుద్ధ సంస్థగా  పేర్కొంటూ ట్రైబ్యునల్ మరో ఐదేళ్లపాటే నిషేధాన్ని పొడగించింది. ఈ విచారణలో భాగంగా యాసిన్ మలిక్ తన అఫిడవిట్ సమర్పించాడు. తాను హింసా మార్గాన్ని విడిచిపెట్టానని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News