Thursday, January 23, 2025

గాయత్రి జోడీ సంచలనం

- Advertisement -
- Advertisement -

Gayatri Gopichand and Trisha Jolly reach semifinals in women's doubles

 

బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన గాయత్రి గోపీచంద్‌-త్రిసా జోలి జోడీ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గాయత్రి జంట శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జంట లీ సోహిషిన్ సియుంగ్‌చాన్(కొరియా) జోడీపై విజయం సంచలన విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన పోరులో భారత జంట 14-21, 22-20, 21-15 తేడాతో కొరియా జోడీని ఓడించింది. తొలి సెట్‌లో గాయత్రి జోడీకి చుక్కెదురైంది. అయితే తర్వాతి రెండు సెట్లలో గెలిచిన భారత జంట సెమీస్‌కు చేరుకుంది. ఈ విజయంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్షసేన్ కూడా సెమీస్‌కు చేరుకున్నాడు.క్వార్టర్ ఫైనల్ పోరు నుంచి ప్రత్యర్థి ఆటగాడు వైదొలగడంతో లక్షసేన్‌కు బై లభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News