షార్జా: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా విండీస్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గేల్ విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 13 పరుగులు చేశాడు. తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ తేలిపోయాడు. ఈసారి 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పేలవమైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. పది బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
అంతకుముందు ఐపిఎల్‌లోనూ గేల్ అంతంత మాత్రం బ్యాటింగ్‌నే కనబరిచాడు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే గేల్ వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం విండీస్‌కు ప్రతికూలంగా తయారైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గేల్ ప్రతి మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మిగిలిన మ్యాచుల్లోనైనా గేల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరుస్తాడా లేదా అనేది సందేహంగా మారింది. అతని ఆట తీరు ఇలాగే ఉంటే వచ్చే ఐపిఎల్‌లో అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌ను శాసించిన గేల్ కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దీంతో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లకు ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. ఇప్పటికైనా గేల్ తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలి.
Gayle hits low scores in T20 World Cup 2021