Thursday, December 19, 2024

గాజాలో 15,200 కు పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

ఖాన్ యోనిస్ : గాజాలో ఇజ్రాయెల్ దాడులకు మృతుల సంఖ్య 15,200 కు పెరిగిందని, వీరిలో70 శాతం మంది మహిళలు, పిల్లలేనని గాజా లోని హమాస్ ప్రభుత్వ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అష్రాఫ్ అల్ కద్రా శనివారం ఈ సంఖ్య వెల్లడించారు. అంతకు ముందు మంత్రిత్వశాఖ 13,300 మంది మృతి చెందారని వెల్లడించింది. ఇంతలో మృతుల సంఖ్య స్వల్పంగా ఎలా పెరిగిందో వివరించలేదు రవాణా మార్గాలకు ఆటంకాలు, ఆస్పత్రుల్లో ఆపరేషన్లు సరిగ్గా జరగకపోవడం తదితర సమస్యలున్నప్పటికీ వాటినేవీ ప్రస్తావించకుండా నవంబర్ 11 నుంచి పెరిగిన మృతుల సంఖ్య వివరాలనే మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. ఇప్పటివరకు 40 వేల మంది తీవ్రంగా గాయపడ్డారని అల్‌కద్రా పేర్కొన్నారు. శనివారం ఇజ్రాయెల్ దాడులు దక్షిణగాజా లోని ఖాన్‌యోనిస్ లోనే ఎక్కువగా జరిగాయి. దాదాపు 50 హమాస్ ప్రాంతాలనే లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News