- Advertisement -
హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాశ్ తెలిపారు. కృష్ణా జలాల విషయంలో ఎపి-తెలంగాణ మధ్య వివాదం జరుగుతుండడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో జరిగిన అన్యాయం కంటే మరో రెండు రెట్లు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్రాల డబ్బులతో ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో మోడీ ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని, రాష్ట్ర ప్రజలిచ్చిన పన్నులతో కట్టిన ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. బిజెపియేతర ప్రభుత్వాలను చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -