గవర్నర్‌కు గెజిట్ అందజేసిన సీఈవో వికాస్‌రాజ్
దీంతో పాటు గెలుపొందిన అభ్యర్థుల జాబితా సమర్పణ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. సోమవారం ఈ గెజిట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదికతో పాటు గెలుపొందిన 119 మంది ఎమ్మెల్యేల జాబితాను సీఈవో వికాస్ రాజ్ గవర్నర్‌కు సమర్పించారు.
మరోవైపు ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ అసెంబ్లీ రద్దు ప్రతులను గవర్నర్‌కు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి అందజేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సిఎంతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు కొత్త మంత్రుల కోసం అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. ఈ మేరకు దిల్‌కుష్ అతిథి గృహానికి వాహనాలను తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి తగిన విధంగా సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జీఏడీ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది.