Saturday, November 16, 2024

మహబూబాబాద్ పరిధిలో అతిపెద్ద జాతీయ రహదారి : ఎంపి కవిత

- Advertisement -
- Advertisement -

Gazette will be released for construction of Mahabubabad NH

 

రూ. 2వేల కోట్లతో 234 కిలోమీటర్లకు త్వరలో గెజిట్

మనతెలంగాణ/ఇల్లెందు : మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అతిపెద్ద జాతీయ రహదారి నిర్మాణానికి మూడు రోజుల్లో గెజిట్ విడుదల అవుతుందని ఎంతో సంతోషంగా ఉందని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత అన్నారు. ఈ మేరకు కేంద్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు నితిశ్ గడ్కరీని ఆమె కలసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్ గౌరెల్లి నుంచి ప్రారంభమయ్యా ఎన్‌హెచ్-30 నూతన జాతీయ రహదారి వలిగొండ, తొర్రురు, నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లెందు మీదుగా కొత్తగూడెం వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బైపాస్‌లు, జంక్షన్ల కోసం భూసేకరణ అభివృద్ధి పనులు, సుందరీకరణ పనులు ఈ జాతీయ రహదారి నిర్మాణంలో ఉంటాయని పేర్కొన్నారు.

ఈ జాతీయ రహదారి నిర్మాణానికి ఒక కిలోమీటర్‌కు రూ.6 నుంచి రూ.7కోట్ల వ్యయం కానుందని ఆమె తెలపారు. జాతీయ రహదారి నెంబర్ కోసం అనేక పర్యాయాలు అధికారులను, మంత్రులను పలుమార్లు కలశానని చివరకు జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రావడం వల్ల పార్లమెంట్ పరిధిలోనే అనే పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు పోనున్నాయిన తెలిపారు. ఈ జాతీయ రహదారి నిర్మాణం వల్ల భద్రాచలంలోని శ్రీరాముల వారి ఆలయానికి రాకపోకలకు మరింత సుకమవనున్నట్లు తెలిపారు. తన కృషికి ఫలితం దక్కడం పట్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Gazette will be released for construction of Mahabubabad NH
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News