Monday, December 23, 2024

పరస్త్రీ మోజులో ఆర్మీ అధికారి..కోర్టు మార్షల్ శిక్ష ఖరారు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: తన కార్యాలయంలోనే పనిచేసే ఒక మహిళా క్లర్క్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరానికి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ఒక అధికారిని జనరల్ కోర్టు మార్షల్(జిసిఎం) దోషిగా తేల్చింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో వీరిద్దరూ పనిచేస్తున్నారు.

అకాడమీలో క్లర్క్‌గా పనిచేస్తున్న మహిళ వివాహిత అయినప్పటికీ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపిని సిజిఎం ఆ లెఫ్టినెంట్ కల్నల్‌కు మూడేళ్ల సర్వీసుపై కోత, జీతంపై మూడేళ్ల కోత, హోదాపై మూడేళ్ల కోతతోపాటు తీవ్ర అభిశంసన విధిస్తూ శిక్ష ఖరారు చేసింది.

కల్నల్ హర్‌ప్రీత్ సింగ్ అధ్యక్ష్రతన ఏర్పడిన సిజిఎంలో జడ్జి అడ్వకేట్‌గా లెఫ్టినెంవ కల్నల్ రౌరవ్ వర్మ, ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదిగా కల్నల్ వీరేందర్ సింగ్(రిటైర్డ్) వ్యవహరించారు.

లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉండి అనుచిత ప్రవర్తనకు పాల్పడినందుకు ఆర్మీ యాక్ట్‌లోని సెక్షన్ కింద ఆ అధికారిపపై విచారణ జరిగింది. సైనిక క్రమశిక్షణ, సత్ప్రవర్తనకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సెక్షన్ కింద ఆ అధికారిపై కేసు నమోదైంది.
వివాహిత అమిన ఒక మహిళా క్లర్క్‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతోపాటు ఆమె మళ్లీ పిల్లల్ని కనేందుకు వీలుగా సర్జరీ చేసుకునేందుకు ఆమె వెంట భర్తగా ఆసుపత్రికి ఆ అధికారి వెళ్లినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

ఆమెను తన భార్యగా చూపడానికి ఆమె పేరిట డిపెండెంట్ కార్డు కూడా ఆయన సృష్టించాడు. 2017 ఆగస్టు నుంచి 2019 డిసెంబర్ మధ్యన ఈ పరిణామాలు చోటుచేసుకోగా అప్పుడు ఆయన మేజర్ ర్యాంకులో ఉన్నారు. అయితే 2018 డిసెంబర్‌లో ఆయనకు లెఫ్టినెంట్ కల్నల్‌గా ప్రమోషన్ లభించింది. 2020లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

తాను నిర్దోషినని, తనపై చేసిన అభియోగాలన్నీ అసత్యాలని ఆయన వాదించినప్టపికీ ప్రాసిక్యూషన్ మాత్రం బలమైన పత్రాలతో ఆధారాలను సమర్పించింది.ఆ మహిళతో జరిపిన వాట్సప్ చాట్‌లతోపాటు టెలిఫోన్ సంభాషణల రికార్డింగులను కూడా ప్రాసిక్యూషన్ సమర్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News