Saturday, November 2, 2024

జిడిపి 8 శాతానికి చేరొచ్చు

- Advertisement -
- Advertisement -

ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (20223-24) భారతదేశం జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 8 శాతాన్ని తాకవచ్చని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం రెండో ముందస్తు అంచనా వేసిన 7.6 శాతం కంటే వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు 7.6 శాతం కంటే 8 శాతానికి చేరుకోవచ్చని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఆర్‌బిఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 జనవరిలో ద్రవ్యోల్బణం రేటు 5.1 శాతానికి తగ్గినప్పటికీ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్‌బిఐ గవర్నర్ చెప్పారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నాయని, సరఫరా గొలుసు కూడా సవాలుగా ఉందని, ఆహార పదార్థాల ధరలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటు 5.1 శాతానికి తగ్గిందని, అయితే ఇది ఆర్‌బిఐ లక్ష్యం 4 శాతానికి ఇంకా 110 బేసిస్ పాయింట్ల దూరంలో ఉందన్నారు. ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి తీసుకురావడమే ఆర్‌బిఐ లక్ష్యమని తెలిపారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యపై వచ్చిన విమర్శలపై ఆర్‌బిఐ గవర్నర్ స్పందించారు. ఆర్‌బిఐ చర్య నియంత్రిత సంస్థకు వ్యతిరేకంగా ఉందని, ఏ ఫిన్‌టెక్ కంపెనీకి వ్యతిరేకంగా కాదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News