Friday, December 20, 2024

ఇన్వెస్ట్‌మెంట్-గ్రేడ్ పబ్లిక్ కంపెనీగా ప్రారంభించబడిన జీఈ ఏరోస్పేస్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: జీఈ వెర్నోవా విభజన పూర్తయిన తర్వాత, విమాన రంగం భవిష్యత్తు ను నిర్వచించే ఒక స్వతంత్ర పబ్లిక్ కంపెనీగా జీఈ ఏరోస్పేస్జు అధికారికంగా ప్రారంభమైనట్లుగా సంస్థ ప్రకటించింది. జీఈ ఏరోస్పేస్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NYSE)లో “జీఈ” టిక్కర్ క్రింద వర్తకం చేస్తుంది. ఈరోజు, ఏప్రిల్ 2, 2024, ఉదయం 9:30 గంటలకు ఈటీ, జీఈ ఏరోస్పేస్ మరియు జీఈ వెర్నోవా కలిసి NYSEలో ప్రారంభ గంటను మోగిస్తాయి.

జీఈ ఏరోస్పేస్ ఛైర్మన్, సీఈఓ హెచ్ లారెన్స్ కల్ప్ జూనియర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “మూడు స్వ తంత్ర, పబ్లిక్ కంపెనీల విజయవంతమైన ప్రారంభం ఇప్పుడు పూర్తయింది–ఎన్నో ఏళ్లుగా కొనసాగిన జీఈ పరివర్తనలో చారిత్రాత్మక చివరి దశను ఈ రోజు సూచిస్తుంది. ఈ నిర్ణయాత్మక క్షణాన్ని సాధించడంలో మా బృందం, వారి శక్తిసామర్థ్యాలు, వారి అంకితభావం గురించి నేను చాలా గర్వపడుతున్నాను” అని అన్నారు.

“ఒక శతాబ్దపు నేర్చుకునే, జీఈ ఆవిష్కరణ వారసత్వాన్ని కొనసాగిస్తూ, జీఈ ఏరోస్పేస్ బలమైన బ్యాలెన్స్ షీట్‌తో ముందుకు సాగుతుంది. విమాన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, ప్రజలను తీసుకెళ్లడానికి, వారిని సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి ఎక్కువగా దృష్టి పెట్టింది. మా యాజమాన్య లీన్ ఆపరేటింగ్ మోడల్ అయిన ఫ్లైట్ డెక్ మా పునాదిగా, మా కస్టమర్‌లు, ఉద్యోగులు, వాటాదారుల సేవలో మా పూర్తి సామర్థ్యాన్ని మేం గుర్తిస్తామని నేను విశ్వసిస్తున్నాను” అని కల్ప్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 44,000 కమర్షియల్ ఇంజన్లు, దాదాపు 26,000 మిలిటరీ, డిఫెన్స్ ఇంజిన్‌ల ఇన్‌స్టాల్ చేయబడిన బేస్‌తో, జీఈ ఏరోస్పేస్ ప్రొపల్షన్, సర్వీసెస్, సిస్టమ్స్‌లో నిలదొక్కు కున్నఅంతర్జాతీయ అగ్రగామిగా ప్రారంభించబడింది. కంపెనీ 2023లో సుమారు $32 బిలియన్ల సర్దుబా టు రాబడిని* ఆర్జించింది, ఇందులో 70% సేవలు, ఇంజన్ అనంతర మార్కెట్ పటిష్ఠ లావాదేవీల ద్వారా వచ్చాయి.

మార్చిలో కంపెనీ ఇన్వెస్టర్ డే సందర్భంగా, జీఈ ఏరోస్పేస్ తన 2024 మార్గదర్శకత్వాన్ని పునరుద్ఘాటిం చింది. 2028లో ~$10 బిలియన్ల నిర్వహణ లాభం* సాధించాలని ఆశించడంతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక దృక్పథాన్ని అందించింది. అదనంగా, జీఈ ఏరోస్పేస్ వృద్ధిలో, ఇన్నోవేషన్ లో పెట్టుబడి పెట్టడానికి మూల ధన కేటాయింపు ఫ్రేమ్‌వర్క్‌ ను ప్రకటించింది. అలాగే అందుబాటులో ఉన్న నిధులలో సుమారు 70-75% వాటాదారులకు తిరిగి ఇస్తుంది.

జీఈ ఏరోస్పేస్ ప్రారంభం జీఈ ఎన్నో ఏళ్ల ఆర్థిక, కార్యాచరణ పరివర్తన సంపూర్తిని సూచిస్తుంది. 2018 నుండి $100 బిలియన్ల కంటే ఎక్కువ రుణ తగ్గింపుతో సహా వ్యాపారాన్ని గణనీయంగా బలోపేతం చేయడానికి జీఈ చర్యలు తీసుకుంది. అదే సమయంలో, లీన్‌ను స్వీకరించడం, కంపెనీ అంతటా అమలు చేయడం, కస్టమర్ సేవలో నిరంతర అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగించడం, సంస్కృతిలో ప్రగాఢ, సుస్థిరమైన మార్పులను తీసుకువచ్చింది. ఈ పటిష్ఠ పునాది విజయవంతమైన మూడు స్వతంత్ర కంపె నీలు – జీఈ హెల్త్‌ కేర్, జీఈ వెర్నోవా, జీఈ ఏరోస్పేస్ – సృష్టికి వీలు కల్పించింది. వీటిలో ప్రతి ఒక్కటి ఇప్పుడు జీఈ ఆవిష్కరణ చరిత్రపై నిర్మాణానికి చక్కగా రూపుదిద్దుకున్నాయి.

జీఈ కామన్ స్టాక్‌ను కలిగి ఉన్నవారు జీఈ కామన్ స్టాక్‌లోని ప్రతి నాలుగు షేర్లకు జీఈ వెర్నోవా కామన్ స్టాక్‌లో ఒక వాటాను పొందేందుకు అర్హులు. అమెరికా ఫెడరల్ ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రయోజనాల కోసం, అమెరికాలోని జీఈ షేర్‌హోల్డర్‌ల కోసం పంపిణీ పన్ను-సమర్థవంతమైన పద్ధతిలో నిర్వహించబడింది.

పాల్, వీస్, రిఫ్‌కిండ్, వార్టన్ & గారిసన్ ఎల్ఎల్పీ న్యాయ సలహాదారులుగా వ్యవహరించాయి. ఎవర్‌కోర్, మోర్గాన్ స్టాన్లీ , పీజేటీ పార్ట్ నర్ ఈ లావాదేవీపై జీఈకి ప్రధాన ఆర్థిక సలహాదారులుగా ఉన్నాయి. డీఎల్ఏ పైపర్, గిబ్సన్, డన్ & క్రచర్ ఎల్ఎల్పీ నుండి న్యాయ సలహాను, సిటీ బ్యాంక్, ది కాన్సెల్లో గ్రూప్, బీఎన్పీ పరిబాస్, యూబీఎస్ నుండి కూడా ఆర్థిక సలహాలను కంపెనీ పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News