Friday, December 20, 2024

జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన జీఈ ఏరోస్పేస్

- Advertisement -
- Advertisement -

జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు జీఈ ఏరోస్పేస్ ఇటీవలే ప్రకటించింది. ఇది మునుపటి జీఈ ఫౌండేషన్ 100 సంవత్సరాల పైబడిన వారసత్వంపై రూపొందించిన కొత్త అధ్యాయాన్ని వేడుక చేసుకుంటోంది. జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ దాతృత్వ వ్యూహం మరియు కార్యక్రమాలు శ్రామిక శక్తి అభివృద్ధి, విపత్తు ఉపశమనం మరియు జీఈ ఏరోస్పేస్ ఉద్యోగుల ప్రయత్నాలను విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెడుతూ, జీఈ ఏరోస్పేస్ కమ్యూనిటీలలో “ప్రజల ఉన్నతి” అనే సంస్థ ఉద్దేశాన్ని నెర వేర్చడంలో సహాయపడతాయి.

దక్షిణాసియాలో, జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ నిరుపేద వర్గాల కోసం విపత్తు సహాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం స్థానిక భాగస్వాములతో కలిసి పని చేయడం కొనసాగించనుంది. దక్షిణాసియా గత 10 సంవత్సరాలలో గ్రాంట్లు మరియు సంబంధిత ప్రోగ్రామింగ్‌లతో సహా ఫౌండేషన్‌కు సంబంధించి మొత్తం $ 1.2 మిలియన్ డాలర్లను అందుకుంది. ఈ నిధులు బెంగుళూరు, పుణె, దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో ప్రభావితమైన సంఘాలకు ప్రయోజనం చేకూర్చాయి.

“మేం ఉండే, పని చేసే ప్రాంతాల్లో కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడాన్ని, వాటిని బలోపేతం చేసే బాధ్య తను జీఈ ఏరోస్పేస్ ఎంతో తీవ్రంగా తీసుకుంటుంది” అని జీఈ ఏరోస్పేస్ ఛైర్మన్, సీఈఓ హెచ్ లారెన్స్ కల్ప్ జూనియర్ అన్నారు. “జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ ప్రారంభం అనేది అంతర్జాతీయ ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీగా మా ప్రత్యేక నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా స్థానిక కమ్యూనిటీలను మార్చడంలో మరియు భవి ష్యత్తు కోసం బలమైన శ్రామిక శక్తిగా వృద్ధి చేయడంలో సహాయపడుతుంది. 100-సంవత్సరాల సానుకూల ప్రభావం వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు మేం గర్విస్తున్నాం. జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ రాబోయే అనేక సంవత్సరాలు ఈ మార్పును కొనసాగించడాన్ని చూడటానికి నేను ఎదురుచూస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

ఫౌండేషన్ కార్యక్రమాలు మూడు ప్రధాన రంగాలపై దృష్టి సారిస్తాయి మరియు 2030 నాటికి కొత్త ప్రోగ్రామింగ్‌ లో $22 మిలియన్లకు పైగా మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. తయారీ, ఇంజనీరింగ్ పరిశ్రమలలో బలమైన, విభిన్నమైన శ్రామిక శక్తిని పెంపొందించడం, ప్రపంచాన్ని ప్రభావితం చేయడంలో సమర్థతను ప్రదర్శించిన మానవతా మరియు కమ్యూనిటీ కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం వంటి ప్రయత్నాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల నిమగ్నతను విస్తరించడం వీటిలో ఉంటాయి.

“భవిష్యత్తులో బలమైన శ్రామిక శక్తి, విపత్తు ఉపశమనం, ఉద్యోగులను అందించడంపై దృష్టి సారిం చిన దాతృత్వ మద్దతు యొక్క ఈ తదుపరి అధ్యాయాన్ని పర్యవేక్షించడం మాకు చాలా గర్వంగా ఉంది” అని జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మేఘన్ థర్లో అన్నారు. “మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలకు మద్దతు ఇచ్చే మా పనిని విస్తరించడానికి, మరింత వైవిధ్యమైన, నైపుణ్యం కలిగిన పరిశ్రమను అభివృద్ధి చేయ డానికి ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.

నెక్స్ట్ ఇంజనీర్స్‌, స్టెమ్ విద్య

నెక్స్ట్ ఇంజనీర్స్‌ ని విస్తరించడానికి 2030 నాటికి $20 మిలియన్ల మొత్తాన్ని వెచ్చించేందుకు ఫౌండేషన్ కట్టు బడి ఉంది. ఇది ఇంజినీరింగ్‌లో యువ ఉద్యోగుల వైవిధ్యాన్ని పెంచడానికి, మిడిల్ స్కూల్ నుండి కాలేజీకి మ ధ్య అంతరాన్ని తగ్గించడానికి పని చేస్తున్న ఒక అంతర్జాతీయ కార్యక్రమం. నెక్స్ట్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు దాదాపు 18,000 మంది విద్యార్థులను చేరుకుంది. జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ విజయవంతమైన సిన్సి నాటి కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగించనున్నట్లు ప్రకటించింది. రాబోయే సంవత్సరాల్లో ప్రకటించబోయే అదనపు సైట్‌లతో పాటు పోలాండ్‌ లోని వార్సాతో సహా నాలుగు అదనపు నగరాలకు నెక్స్ట్ ఇంజనీర్స్ ప్రోగ్రా మ్‌ను విస్తరింపజేయనున్నట్లు ఫౌండేషన్ ప్రకటించింది.

శ్రామికశక్తి అభివృద్ధి

పెరుగుతున్న విమానయానం, ఉత్పాదక శ్రామికశక్తి డిమాండ్లకు ప్రతిస్పందనగా, జీఈ ఏరోస్పేస్ ఫౌం డేషన్ సంస్థ కార్యకలాపాలు కొనసాగే భౌగోళిక ప్రాంతాలలో శ్రామికశక్తి అభివృద్ధి కార్యక్రమాలకు మద్ద తుగా $2 మిలియన్లను విరాళంగా అందించనుంది.

విపత్తు సహాయం, మానవతా ప్రయత్నాలు

జీఈ ఏరోస్పేస్ వ్యక్తులు, సాంకేతికత, ఇతర వనరులపై ఆధారపడి, ఫౌండేషన్ విపత్తు నివారణ, మానవతా సహాయం కోసం $2 మిలియన్ల నిబద్ధతను ప్రకటించింది. విపత్తు ప్రతిస్పందనలో విమానయానం పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను గుర్తించి Airlink తో $1 మిలియన్ భాగస్వామ్యం కూడా ఏర్పరచుకుంది.

మ్యాచింగ్ గిఫ్ట్స్ కార్యక్రమం

ఫౌండేషన్ తన మ్యాచింగ్ గిఫ్ట్‌ ల ప్రోగ్రామ్‌ను కొనసాగించడం పట్ల గర్విస్తోంది. ఇది వ్యక్తిగత దాతృత్వంలో ఉద్యో గుల ప్రయత్నాలను ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా అర్హత ఉన్న జీఈ ఏరోస్పేస్ ఉద్యోగుల పిల్ల లకు పోటీ స్కాలర్‌షిప్‌లను అందించే స్టార్ అవార్డ్స్ ప్రోగ్రామ్‌ను కొనసాగించడం చేస్తుంది. జీఈ 1954లో కార్పొ రేట్ మ్యాచింగ్ గిఫ్ట్‌ ల భావనను రూపొందించింది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి విరాళాలు, మ్యాచింగ్ గిఫ్ట్‌ లు $1.5 బిలియన్లకు మించిపోయాయి. స్టార్ అవార్డుల కార్యక్రమం 1984లో ప్రారంభిం చినప్పటి నుండి 15,000 కంటే ఎక్కువ మందికి ఇవ్వడం ద్వారా $21 మిలియన్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించింది.

విమానరంగ భవిష్యత్తును నిర్వచించేలా ఏప్రిల్ 2, 2024న ఒక స్వతంత్ర పబ్లిక్ కంపెనీగా జీఈ ఏరోస్పేస్‌ను ప్రారంభించిన తర్వాత జీఈ ఏరోస్పేస్ ఫౌండేషన్ రూపొందించబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News