Thursday, January 23, 2025

రైతుబీమా తరహాలో గీత బీమా ఇవ్వాలి : బూర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రైతు బీమా తరహాలోనే పరిహారం అందజేతను గీత కార్మికులకు వర్తింపజేయాలని బిజెపి నేత, మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ కోరారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుబీమాలో భాగంగా సహజ మరణం అయినా ప్రమాదమైన రూ. 5 లక్షలు అందిస్తున్నారు. అదే గీత కార్మికులు చెట్టుపై నుంచి పడి మరణిస్తేనే 5 లక్షలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద నీరా కేఫ్ పెట్టడం వల్ల గీత కార్మికులకు ఏం లాభం లేదని, గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి, వారికి లైసెన్స్ ఇచ్చి నీరా కేఫ్‌లు ఏర్పాటు చేయించాలని కోరారు.

Also Read: జూన్ నెలాఖరు వరకు 500 బస్తీ దవాఖానలు

గొల్ల కుర్మలను మోసం చేస్తున్నారని, డబ్బులు ముందు తీసుకుని గొర్లు ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదన్నారు. ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షకు పైగా ఉన్న హ్యాండ్‌లూమ్స్ కేంద్రాలకు రాయితీలను తొలగించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. యూనిట్ కు రూ.2 ఉంటే దానిని రూ. 8 పెంచారని, దీంతో భారీగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోందన్నారు. కేటగిరీ 4 నుంచి కేటగిరీ 3కి మార్చారని, దీనిని వెంటనే సవరించాలని కోరారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర నేతలు నందనం దివాకర్, హరిశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News