Monday, December 23, 2024

2022 అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న గీతాంజలి శ్రీ , డైసీ రాక్‌వెల్ నవల

- Advertisement -
- Advertisement -
Geetanjali Shree
2022 అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న
గీతాంజలి శ్రీ రచించిన 
తొలి హిందీ అనువాదిత నవల  ‘టోంబ్ ఆఫ్ సాండ్’ .

న్యూఢిల్లీ: గీతాంజలి శ్రీ(64)  రాసిన హిందీ మాతృక నవల ‘రేత్ సమాధి’(2018)ని  డైసీ రాక్వెల్ ఇంగ్లీషులో ‘టోంబ్ ఆఫ్ సాండ్’(2021)గా అనువదించారు. దానిని స్వతంత్ర ప్రచురణ సంస్థ యాక్సిస్ ప్రెస్ ప్రచురించింది. అయితే రచయిత్రి, అనువాదకురాలు కొవిడ్-19 కారణంగా ఇదివరలో కలుసుకెోలేకపోయారు. కనీసం జూమ్ వంటి యాప్ ద్వారా కూడా వారు మాట్లాడుకోలేదు. వారిద్దరు కలిసి రూపొందించిన సాహిత్యం (ఇంగ్లీషు అనువాద నవల) ఇప్పుడు 2022 ద ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ను గెలుచుకుంది.   భారతీయ భాషలో  రాసిన నవల బూకర్ ప్రైజ్ ను గెలుచుకోవడం ఇదే తొలిసారి. హిందీ నుంచి అనువాదం పొంది అవార్డును అందుకున్న తొలి నవల కూడా ఇదే. ఇండియా, దాని విభజన ఇతివృత్తం ఆధారంగా ఈ నవల ఉంది. రచయిత్రి గీతాంజలి శ్రీ ఇప్పటికే మూడు నవలలు, అనేక కథానికలు రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News