Monday, November 25, 2024

గీత వృత్తిని పునరుద్ధరించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

 

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ శాఖల శ్రీనివాస్ గౌడ్ కర్ణటాక రాష్ట్ర పర్యటన లో భాగంగా దక్షిణ కన్నడ ప్రధాన కేంద్రం మంగళూరు లో కర్నాటక రాష్ట్రంలో గీతవృత్తిని పునరుద్ధరణ కోసం స్వామి ప్రణవానంద చేపట్టిన మహాపాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేపడుతున్నారన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో గీత వృత్తిని పునరుద్ధరించేందుకు తెలంగాణ గౌడ సంఘాలు కర్ణాటక ఈడిగ, గౌడ కులస్తులకు మద్దతుగా పోరాటం చేస్తారని మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో గీత వృత్తిని పునరుద్ధరణ కోసం చేపట్టిన మహా పాదయాత్రను ఆయన స్వాగతించారు. స్వామి ప్రణవానందను అభినందించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా మంగళూరు చేరుకున్న మంత్రికి భారీగా ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News