Monday, January 20, 2025

గీత కార్మికునికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కమాన్‌పూర్: మండలంలోని సిద్దిపల్లి గ్రామానికి చెందిన గుర్రం నారాయణ రోజు వారి వృత్తి కల్లు గీతలో భాగంగా సోమవారం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా వర్షంతో తడిచిన చెట్టు మోకు జారి చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా గోదావరిఖని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాటిచెట్టుపై నుంచి పడి గాయపడిన గీత కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పలువురు గీత కార్మికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News