Thursday, December 26, 2024

గీతాంజలి మళ్లీ వచ్చింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ అంజలి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ ‘గీతాంజలి’ సీక్వెల్ గురించి ప్రకటించారు మేకర్స్. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వెన్నులో వణుకు తెప్పించే స్పైన్ చిల్లింగ్ ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ శనివారం నుంచి మొదలైంది. కోన వెంకట్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ సినిమాను ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి నటిస్తున్న 50వ సినిమా ఇది. ఎవివి సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు. ఓ పాడుబడ్డ బంగ్లా ప్రాంగణంలో అటుగా తిరిగి కూర్చొని ఉన్న అమ్మాయితో పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామచంద్ర క్లాప్‌కొట్టారు. సినిమా స్క్రిప్ట్‌ని ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా దర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ఈ చిత్రంలో అంజలి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News