Sunday, December 22, 2024

కన్హయలాల్ కుటుంబానికి గెహ్లాట్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

Gehlot meets Kanhaiya Lal's family

ఉదయ్‌పూర్: ఇద్దరు వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురైన కన్హయలాల్ ఇంటిని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం సందర్శించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయ్‌పూర్‌లోని సెక్టార్ 14లో ఉన్న కన్హయ లాల్ నివాసానికి గెహ్లాట్‌తోపాటు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతస్ర, రెవెన్యూ మంత్రి రాంలాల్ జాట్, డిజిపి ఎంఎల్ లాథెర్, ఇతర నాయకులు, అధికారులు వెళ్లారు. టైలర్ పని చేసే కన్హయ లాల్‌ను గత మంగళవారం ఇద్దరు వ్యక్తులు హత్య చేసి ఆన్‌లైన్‌లో ఆ వీడియోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇస్లామ్‌ను అవమానించినందుకు ప్రతీకారంగా తాము ఈ హత్య చేసినట్లు నిందితులు వీడియోలో పేర్కొన్నారు. కాగా. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని, సాధ్యమైనతం త్వరితంగా ఎన్‌ఐఎ చార్జిషీట్ దాఖలు చేయాలని గెహ్లాట్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News