Friday, December 27, 2024

జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః డిటోనేటర్లు, జిలిటెన్‌స్టిక్స్ నిల్వ చేస్తున్న ఇద్దరు నిందితులను యాదగిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 239 జిలిటెన్‌స్టిక్స్, 666 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

భువనగరి మండలం, రాయగిరికి చెందిన శివరాత్రి మహేష్, యాదగిరిగుట్టకు చెందిన వినోద్ కలిసి వాటిని రవాణా చేస్తున్నారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు నిందితులు బైక్‌పై జిలిటెన్‌స్టిక్స్, డిటోనేటర్లు తీసుకుని వస్తున్నారు. వారిని ఆపి విచారించగా నిల్వ చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News