Monday, December 23, 2024

పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మెన్‌గా గెల్లు శ్రీనివాస్ యాదవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మెన్‌గా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గెల్లు శ్రీనివాస్ ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారని ఈ మేరకు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు గెల్లుకు కార్యాలయం ఇతర వసతి సౌకర్యాలు కల్పించాలని పర్యాటక శాఖను చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆ ప్రకటనలో ఆదేశాలు జారీ చేసింది. కాగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్ కు చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంఏ, ఎల్‌ఎల్‌బి పట్ట భద్రుడు, రాజనీతి శాస్త్రంలో పరిశోధక విద్యార్థి కావడం గమనార్హం. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులుగాను ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News