Thursday, January 23, 2025

యాదవులు ఓట్లేయ్యనిదే రేవంత్ గెలిచాడా?: గెల్లు శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అర్ధరహిత పదజాలంతో సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని, పెండ పిసికే వారి గురించి ఏం మాట్లాడుతా.. అంటూ తమ యాదవుల జాతిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు తగిన బుద్ధి చెప్తామని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యాదవులు ఓట్లేయ్యనిదే టి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచాడా..? ఈ విషయంలో ఆయన ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అని అన్నారు. అసలు బీసీలను వ్యతిరేకించే పార్టీయే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, యాదవుల కులవృత్తిని రేవంత్ దూషించిన నేపథ్యంలో గురువారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో తెలంగాణ అన్ని జిల్లాల నుండి యాదవులు భారీగా తరలివచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రేవంత్ వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ యాదవులు భగ్గుమంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి 9వ తేదీన యాదవులను విమర్శించి మాట్లాడితే కాంగ్రెస్ యాదవ సోదరుడు అంజన్ కుమార్ యాదవ్ గానీ, బీసీ నాయకులు వి.హన్మంత్ రావ్ గానీ, మల్లు బట్టి విక్రమార్క గానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వైఖరిని ఇప్పటి వరకు ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇందిరాగాంధీ నాటి నుండి ఈరోజు వరకు బీసీలను ఉద్దేశపూర్వకంగానే చులకనగా చూస్తున్నారని, రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News