- Advertisement -
న్యూఢిల్లీ : చేనేత కార్మికులు, వృత్తి పనివారికి మెరుగైన మార్కెట్ సౌకర్యం అందించే విధంగా ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్‌ను రూపొందించింది. చేనేతకార్మికులు, చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వ విభాగాలకు విక్రయించడానికి వీలుగా ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు. చేతివృతుల వారు, సూక్ష్మ పారిశ్రామిక వేత్తలు, మహిళలు, గిరిజన పారిశ్రామిక వేత్తలు, స్వయం సహాయక బృందాలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. గత నెల 30 వరకు 28,374 మంది చేతి వృత్తుల వారు , 1,49,422 మంది చేనేత కార్మికులు పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
- Advertisement -