న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం కూలిపోయిన ఎంఐ17వి5 హెలికాప్టర్ అత్యాధునికమైనది. ఆ హెలికాప్టర్ 2012 నుంచి భారత వాయుసేన(ఐఎఎఫ్)లో ఉంది. ఈ హెలికాప్టర్ అడ్వాన్స్‌డ్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్. దానిని రష్యాకు చెందిన కజన్ తయారుచేసింది. ఆ హెలికాప్టర్‌కు వాతావరణ రాడార్, అతాయధునిక పరికరాలు, నైట్ విజన్ డివైసెస్‌లు ఉన్నాయి. దానికి కొత్త పికెవి8 ఆటో పైలెట్ సిస్టం, కెఎన్‌ఇఐఅవియోనిక్స్ సూట్ ఉన్నాయి. ఎగిరేప్పుడు అది 13000 కిలోలను, 4000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. భారత సేనలో మీడియా లిఫ్ట్ హెలికాప్టర్‌లను చేర్చేందుకు ఎనభై ఎంఐ17వి5 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు భారత్ 2008లో రష్యాతో ఒప్పందం చేసుకుంది. తర్వాత ఆ కాంట్రాక్ట్‌ను 151 హెలికాప్టర్ల కొనుగోలుకు పెంచారు. 2011లో తొలి బ్యాచ్ హెలికాప్టర్లు భారత్‌కు చేరుకున్నాయి. హీట్ సీకర్ మిస్సైల్స్‌కు వ్యతిరేకంగా ఈ హెలికాప్టర్‌కు సెల్ఫ్ డిఫెన్స్ సిస్టం ఫిట్ చేశారు. హెవీ ఆర్మ్‌డ్ కాక్‌పిట్, వైటల్ సిస్టమ్స్, కాంపొనెంట్స్ దీనికున్న అదనపు ఫీచర్లు.
“సిబ్బందిని, కార్గో, సామాగ్రిని తీసుకెళ్లేలా ఎంఐ17వి5 మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్‌ను రూపొందించడం జరిగింది. గ్రౌండ్ టార్గెట్‌ను ఇది ఛేదిస్తుంది. గాయపడిన వారిని తీసుకొస్తుంది” అని రష్యా రక్షణ ఎగుమతి కంపెనీ రోసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్ తెలిపింది. ఆ కంపెనీ కథనం ప్రకారం ఇది గంటకు 250 కిమీ. గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది టెక్నికల్‌గా బాగా అభివృద్ధి చేసిన మి8/17 ఫ్యామిలీకి చెందిన హెలికాప్టర్. దీనికి మంచి ఇంజనీరింగ్ పరిష్కారాలు కూడా ఉన్నాయి.