Saturday, November 16, 2024

దీర్ఘకాల బడుల మూసివేతతో లింగ అసమానత

- Advertisement -
- Advertisement -

యునెస్కో నివేదిక హెచ్చరిక

Gender inequality with long-term school closures
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రబలడంతో ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలం విద్యాసంస్థలను మూసేయడంతో విద్యార్ధుల చదువులు దెబ్బతినడమే కాకుండా లింగ సమానత్వానికి ముప్పు ఏర్పడుతుందని యునెస్కో అధ్యయనం హెచ్చరించింది. పాఠశాలల మూసివేత ప్రభావం బాలబాలికలపై వేర్వేరుగా ఉన్నట్టు తెలిపింది. కరోనా కారణంగా పాఠశాలలను మూసివేయడంతో 190 దేశాల్లో 160 కోట్ల మంది విద్యార్ధులు నష్టపోయారు. వీరు చదువులతోపాటు పాఠశాలలకు హాజరు కావడం వల్ల పొందే ప్రయోజనాలను కోల్పోయారని యునెస్కో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా గియానినీ పేర్కొన్నారు. చదువులు మానేయడం, లింగ సమానత్వానికి ముప్పు, ఆరోగ్యంపై ప్రభావం వంటివి ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఈ అధ్యయనం కోసం దాదాపు 90 దేశాల నుంచి వివరాలను సేకరించారు.

సమాజ కట్టుబాట్లు వంటివి ఆన్‌లైన్ విద్యలో పాలుపంచుకోవడం, నేర్చుకోవడంపై ప్రభావం చూపుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. పేదల విషయానికొస్తే ఇంటిపనులు చేయాల్సిరావడం వల్ల బాలికలకు చదువుకొనే సమయం తగ్గిపోతుంది. జీవనోపాధి పనులపై దృష్టి సారించాల్సి రావడం వల్ల బాలురకూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇంటర్నెట్ సంధానత ఉన్న సాధనాలు, డిజిటల్ నైపుణ్యాలు లేకపోవడం వల్ల బాలికలు ఆన్‌లైన్ విద్యలో వెనుకబడి పోతున్నారు. దీనికి తోడు ఇలాంటి సాంకేతిక పరికరాల వినియోగం విషయంలో వారిపై ఉన్న సామాజిక ఆంక్షలు ప్రతిబంధకమవుతున్నాయి అని తెలిపింది. వాస్తవానికి కొవిడ్ సంక్షోభం ముందు కూడా డిజిటల్ అంశాల్లో లింగపరమైన తారతమ్యాలు ఉన్నాయని పేర్కొంది. ‘పాకిస్థాన్‌లో 44 శాతం మంది బాలికలు మాత్రమే వ్యక్తిగత మొబైల్ ఫోన్ కలిగి ఉన్నారు. అదే సమయంలో 93 శాతం మంది బాలుర వద్ద అవి ఉండటం గమనార్హం. ఫోన్లు లేని బాలికల్లో కొందరు తమ కుటుంబ సభ్యుల సాదనాలపై ఆధారపడుతున్నారు. అయితే అవి కూడా పరిమితం గానే అందుబాటులో ఉంటున్నాయి. బాలికలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తే వాటిని వారు దుర్వినియోగం చేస్తారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో ఉంటోంది’ అని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News