Saturday, November 2, 2024

జనరల్ బోగీల్లో ప్రయాణించిన వారిని ఎలా గుర్తించాలి?

- Advertisement -
- Advertisement -

 

భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపుగా 275 మంది మృతి చెందారు. భువనేశ్వర్‌లో ఎయిమ్స్ వద్ద 150కి పైగా శవాలు ఉన్నాయి. ఇప్పటికి వాటిని గుర్తించలేకపోతున్నామని అధికారులు పేర్కొన్నారు. రైల్వే శాఖ సామూహిక ఖననం చేసే ఆలోచనలో ఉంది. రైల్వే శాఖ అధికారికంగా 275 మంది మృతి చెందారని వెల్లడించింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్యపై స్పష్టత రాలేదు. శవాలను తీసుకెళ్లడానికి కూడా బంధువులు రాలేదు. శవాలను ఏం చేయాలన్న దానిపై అధికారులు గందరగోళంలో ఉన్నారు. ఎసి, రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించిన వారి వివరాలపై స్పష్టత ఉంది. జనరల్ బోగీల్లో ప్రయాణించిన వారిపైనే గందరగోళం నెలకొందని రైల్వే శాఖ వెల్లడించింది. కోరమండల్ జనరల్ బోగీల్లో మృతదేహాలను గుర్తించారు. భువనేశ్వర్ ఎయిమ్స్ దగ్గర 15 ఎపి వాహనాలను సిద్ధం చేయగా మరో పది అంబులెన్స్‌లను భువనేశ్వర్‌కు తరలిస్తున్నారు. 200 మంది బహనాగ గ్రామస్థులు ప్రయాణికులను కాపాడారు.

Also Read: భూమితోనే.. మన మనుగడ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News