Monday, December 23, 2024

తెలంగాణ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ: ఇంద్రకరణ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : నిర్మల్ పురపాలక సంఘం సర్వసభ్య అత్యసర సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే  సిఎం కెసిఆర్ నిర్మల్‌ జిల్లాకు రానున్నారని, నిర్మల్ మున్సిపాలిటి అభివృద్దికి రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని సిఎంకు విన్నవిస్తామని తెలిపారు. ప్రతీ వార్డుకు నిధులు కేటాయించి అభివృద్ది చేస్తామన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలోనే బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని తెలిపారు. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వాలను కూలగొడుతూ ముఖ్యమంత్రులను మారుస్తుందని మహారాష్ట్రలోని జరుగుతున్నా పరిమాణాలను ప్రస్తావించారు. ఇక తెలంగాణ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు.

Also Read: గూడ్సు రైళ్లు ఢీకొని ఆరుగురు రైల్వే సిబ్బందికి గాయాలు

బిజెపి పాలిత రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా నిధులు నివ్వడం లేదన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రాష్ట్ర, నిధులతో అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని స్పస్టం చేశారు. కేంద్రం కక్ష సాధింపు దోరిణిని ప్రజలంతా గమణిస్తున్నారని వెల్లడించారు. పార్టీలు శాశ్వతం కాదని, ప్రజలే అంతిమ నిర్ణేతలని వ్యాఖ్యానించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం చించోలి బి సమీపంలోని ఓకేషనల్ సెంటర్ ఏర్పాటు పై బిజెపి నేతలు నానా రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. ఈద్గాతో పాటు అక్కడ ఓకేషనల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ఆలయాల నిర్మాణంకు కూడా స్థలాన్ని కేటాయించమని ఈ సందర్బంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News