- Advertisement -
పెగాసస్ కథనంపై కేంద్ర మంత్రి వికె సింగ్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం పెగాసస్ స్పై టూల్‌ను కొనుగోలు చేసినట్లు వార్తా కథనాన్ని ప్రచురించిన ది న్యూయార్క్ టైమ్స్ పత్రికను సుపారీ మీడియాగా కేంద్ర మంత్రి జనరల్ వికె సింగ్ అభివర్ణించారు. 2017లో భారత్, ఇజ్రాయెల్ మధ్య అధునాతన ఆయుధాలు, నిఘా వ్యవస్థ కోసం కుదిరిన 2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా పెగాసస్ స్పైవేర్, క్షిపణి వ్యవస్థ భారత్ పొందినట్లు ది న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఇటీవల ప్రచురించింది. ఈ వార్తా కథనంపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికె సింగ్ శనివారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ న్యూయార్క్ టైమ్స్‌ను ఎవరైనా విశ్వసిస్తారా.. సుపారీ మీడియాగా అది పేరుపొందింది అంటూ వ్యాఖ్యానించారు.
- Advertisement -