Sunday, November 3, 2024

1.5 కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు భర్తీ చేసిన పింఛనుదారులు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా దేశవ్యాప్తంగా పెన్షనర్లు 1.5 కోట్ల డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రాలను( లైఫ్ సర్టిఫికెట్లు) జనరేట్ చేశారని శుక్రవారం విడుదల చేసిన ఒక అధికార ప్రకటన తెలిపింది. నవంబర్ 1నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన డిజిటల్ లైఫ్‌సర్టిఫికెట్ క్యాంపెయిన్ 2.0 విజయవంతంగా ముగిసినందుకు పెన్షనర్ల సంక్షేమ శాఖ సిబ్బందిని కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అభినందించారు. పింఛనుదార్ల డిజిటర్ల సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌ను అమలు చేయడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పింఛనుదారుల సంక్షేమాన్ని మెరుగుపర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని,

పెన్షన్ల జీవితాలను సులభతరం చేయడంలో ఈ కార్యక్రమంఒక ముఖ్యమైన ముందడుగని ఆయన అన్నట్లు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది.దేశవ్యాప్తంగా వంద నగరాలు, 597 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా 1.5 కోట్ల డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్‌ల్రను భర్తీ చేయడం జరిగింది. వీరిలో 38.47 లక్షలు కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు,16.15 లక్షల రాష్ట్రప్రభుత్వ పింఛనుదారులు, 50.91 లక్షల మంది ఇపిఎఫ్‌ఓ పింఛనుదారులు ఉన్నట్లు ఆ ప్రకటన తెలిపింది. డిజిటల్ జీవనప్రమాణ్ పత్‌ల్రు సమర్పించిన వారిలో 24 వేల మందికి పైగా 90 ఏళ్లకు పైబడిన వారున్నట్లు కూడా ఆ ప్రకటన తెలిపింది. ఈ పత్రాలను భర్తీ చేయడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News