- Advertisement -
న్యూఢిల్లీ : జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఎఐ) వచ్చే ఏడేళ్లలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)కి కలిపి 1,200 -1,500 బిలియన్ డాలర్లను జోడించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇవై ఇండియా నివేదిక వెల్లడించింది. ‘ఎఐడిఇఎ ఆఫ్ ఇండియా: జనరేటివ్ ఎఐ’ పేరిట ఇవై ఇండియా నివేదిక విడదల చేసింది. దీని ప్రకారం, జనరేటివ్ ఎఐ భారతదేశం డిజిటల్ పరివర్తనను వేగవంతం చేసే సామర్థం కల్గివుంది. జెన్ ఎఐని స్వీకరించడంలో పరిశ్రమ సంసిద్ధత, సవాళ్ల గురించి నివేదిక సమాచారాన్ని అందించింది. జెన్ ఎఐ సాంకేతికత, దాని అప్లికేషన్‌లను అన్ని రంగాలలో పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా భారతదేశం 2029-30 ఆర్థిక సంవత్సరంలో 359-438 బిలియన్‌లను జోడించగలదని నివేదిక అంచనా వేసింది. జిడిపి కంటే 5.9 శాతం నుండి 7.2 శాతం పెరుగుదలకు దారితీసుందని నివేదిక వివరించింది.
- Advertisement -