Tuesday, November 5, 2024

కొవిడ్ తీవ్రత వెనుక జన్యుపరమైన కారణాలు

- Advertisement -
- Advertisement -
Genetic factors behind Covid severity
ఎడిన్‌బర్గ్ వర్శిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడి

లండన్ : కొంతమంది మిగతా వారికన్నా కొవిడ్ తీవ్రమైన లక్షణాలతో సతమతం కాడానికి జన్యుపరమైన కారణాలే దోహదం చేస్తున్నాయని బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ పరిశోధకుల బృందం తన అధ్యయనంలో కనుగొన గలిగింది. జీనోమిక్స్ ఇంగ్లాండ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో బ్రిటన్ లోని 224 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల నుంచి 7491 మంది రోగుల జన్యువులను సేకరించి జన్యుక్రమ విశ్లేషణ చేశారు. ఈ జన్యువుల డిఎన్‌ఎను ఇంతవరకు కొవిడ్ సోకని 48,400 మంది డిఎన్‌ఎతో పోల్చి చూశారు. అలాగే తేలికపాటి లక్షణాలున్న 1630 మంది జన్యువులతోనూ పోల్చి పరిశీలించారు.

అధ్యయనంలో పాలుపంచుకున్నవారి మొత్తం జన్యుక్రమ సరళిని విశ్లేషించి చూశారు. కొవిడ్ తీవ్రతతో సంబంధం ఉన్న జన్యుమార్పులను గుర్తించారు. ఐసియు రోగుల్లోని 16 జన్యువుల్లో కీలకమైన తేడాలను ఇతర గ్రూపుల డిఎన్‌ఎతో పోల్చి పరిశోధక బృందం గుర్తించింది. ఈ అధ్యయనం తాజా ఫలితాలు కొంతమందికి ఎందుకు కొవిడ్ నుంచి ప్రాణాపాయం కలుగుతోందో, మరికొంతమందికి ఎలాంటి లక్షణాలు ఎందుకు కనిపించడం లేదో తెలుసుకున్నామని ఎడిన్‌బర్గ్ వర్శిటీ క్రిటికల్ కేర్ మెడిసిన్ సలహాదారు ప్రొఫెసర్ కెన్నెత్ బెయిల్లీ వివరించారు. దీనివల్ల సమర్థవంతమైన చికిత్స అందించడానికి వీలవుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News