Friday, December 20, 2024

నైకా నుంచి ‘జెంటిల్‌మెన్స్‌ క్రూ’ ఉత్పత్తులు

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎక్కువ మంది అభిమానించే బ్రాండ్లు అయిన నైకా కాస్మెటిక్స్‌, స్కిన్‌ ఆర్‌ఎక్స్‌, వాండర్‌లస్ట్‌ వంటి బ్రాండ్లను విడుదల చేసిన తరువాత.. అందం, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి భారతదేశపు అభిమాన గమ్యస్ధానం నైకా ఇప్పుడు జెంటిల్‌మెన్స్‌ క్రూతో మరో పోర్ట్‌ ఫోలియో సమర్పిస్తోంది. పురుషుల కోసం విస్తృత శ్రేణిలో వ్యక్తిగత గ్రూమింగ్‌ ఉత్పత్తులు ఉండటంతో పాటుగా ఇవి అత్యంత శక్తివంతమైన పదార్ధాలను మిళితం చేసుకున్నాయి. ప్రకృతిలో అత్యుత్తమ ఆఫరింగ్స్‌ కలిగిన ఈ జెంటిల్‌మెన్స్‌ క్రూను ప్రతి రోజూ అవసరమైన డియోడరెంట్లు, బియర్డ్‌ కేర్‌, హెయిర్‌స్టైలింగ్‌ శ్రేణితో విడుదల చేశారు. తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ కోసం మాత్రమే కట్టుబడి ఉండటం కాకుండా అంతకు మించి ఉండటానికి ఈ బ్రాండ్‌ కట్టుబడింది. జెంటిల్‌మెన్స్‌ క్రూ ను ఆధునిక యుగపు పురుషులతో కమ్యూనిటీని నిర్మించే రీతిలో తీర్చిదిద్దారు. ఇక్కడ వ్యక్తిగత గ్రూమింగ్‌ ఎంపికల పట్ల బహిరంగ చర్చ నడపడంతో పాటుగా నిర్ణయాలు తీసుకోవడమూ ప్రోత్సహించబడుతుంది.

ఈ జెంటిల్‌మెన్స్‌ క్రూ నుంచి మొత్తం ఉత్పత్తి శ్రేణిని పవర్‌ ఆఫ్‌ టూ ఫిలాసఫీతో తీర్చిదిద్దారు. ఇది నైపుణ్యంతో కూడిన గ్రూమింగ్‌ను అత్యున్నత సంరక్షణ మరియు పోషణతో అందిస్తుంది. ఆర్గాన్‌ మరియు టీ ట్రీ శ్రేణితో విడుదల చేసిన జెంటిల్‌మెన్స్‌ క్రూ ప్రస్తుతం బియర్డ్‌ గ్రూమింగ్‌ మరియు హెయిర్‌ స్టైలింగ్‌ కోసం ఉత్పత్తులను అందిస్తుంది. శరీరం కోసం ఈ బ్రాండ్‌ ఇప్పుడు అత్యున్నత పనితీరు కలిగిన డియోడరెంట్స్‌ను మూడు ఆహ్లాదకరమైన సెంట్స్‌తో అందిస్తుంది. అవి 48 గంటల పాటు యాక్టివ్‌గా ఉండటంతో పాటుగా మరకలు లేదా చికాకు కలిగించడం జరగదు.

ఈ ఆవిష్కరణ గురించి నైకా బ్రాండ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విశాల్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘మేల్‌ గ్రూమింగ్‌ రంగం అత్యంత వేగంగా మారుతుంది. వినియోగదారులు మరింత విలాసవంతమైన సంరక్షణను తమ చర్మం మరియు జుట్టు లక్ష్యాలకు అనుగుణంగా స్వీకరిస్తున్నారు. జెంటిల్‌మెన్స్‌ క్రూను అత్యున్నత పరిశోధనల చేత తీర్చిదిద్దడం జరిగింది. పురుషులకు వారు ఉత్తమంగా కనిపించేలా మరియు అసాధారణ అనుభూతులను పొందడంలో సహాయపడటానికి సంబంధితమైన గ్రూమింగ్‌ ఎంపికలను అందించేలా రూపొందించబడింది. అత్యంత ప్రాచుర్యం పొందిన విభాగాలు– బియర్డ్‌ కేర్‌, హెయిర్‌ స్టైలింగ్‌, సెంట్స్‌ వాటిని విడుదల చేశాము. ఇప్పుడు ఈ జెంటిల్‌మెన్స్‌ క్రూను వానిటీ స్టాపెల్‌గా మలిచేందుకు సమగ్రమైన వ్యక్తిగత సంరక్షణ కోసం విస్తృత శ్రేణి పోర్ట్‌ఫోలియోతో అందిస్తున్నాము’’అని అన్నారు.

బ్రాండ్‌ యొక్క పరిచయ శ్రేణి ఇక్కడ చూడవచ్చు:

బియర్డ్‌ శ్రేణి

జెంటిల్‌మెన్స్‌ క్రూ ఆర్గాన్‌ మరియు టీ ట్రీ అలా్ట్ర హోల్డ్‌ బియర్డ్‌ వ్యాక్స్‌ – జెంటిల్‌మెన్స్‌ కు ఇది తప్పనిసరిగా ఉండాల్సిన ఉత్పత్తి. మరీ ముఖ్యంగా చక్కగా తీర్చిదిద్దిన, సన్నటి గడ్డం కోరుకునే వారికి ఇది అవసరం. జిగురులా అంటుకోనట్టి దీని ఫార్ములా కారణంగా గడ్డం మరింత మెరుస్తున్న లుక్‌ కలిగి ఉంటుంది. అంతేకాదు ఏకంగా 8 గంటల పాటు ఇది పట్టుకుని ఉంటుంది. దీనిని స్టైలింగ్‌ చేసుకోవడం కూడా సులభం. కాలుష్యం నుంచి కాపాడటంతో పాటుగా తేమ నుంచి కూడా కాపాడుతుంది. అదే సమయంలో ప్యాా బియర్డ్స్‌ సమస్యనూ తొలగిస్తుంది. దీనిలో ఆలోవెరా సైతం ఉంది. ఇది సుదీర్ఘకాలపు మాయిశ్చరైజేషన్‌ అందిస్తుంది. దీనిలో అతి గొప్ప విశేషమేమిటంటే– దీనిని ల్యాబ్‌లో పరీక్షించడంతో పాటుగా జుట్టు బలానికి ఎలాంటి హాని చేయదని నిరూపితమైంది.

జెంటిల్‌మెన్స్‌ క్రూ ఆర్గాన్‌ మరియు టీ ట్రీ అలా్ట్ర సాఫ్ట్‌ బియర్డ్‌ సాఫ్ట్‌నర్‌ : ఇది తేలికపాటిది. అతి తక్కువ ఆయిల్‌ బియర్డ్‌ సాఫ్ట్‌నర్‌గా నాన్‌ స్టికీ లుక్‌కు కలిగి ఉంటుంది. ఇది పొడి, వికృత గడ్డాలను సైతం మృదువుగా నిర్వహించతగిన రీతిలో గడ్డాలుగా మారుస్తుంది. ఏడు రోజులలో రెండు రెట్లు మృదువుగా చేస్తుందనే వాగ్ధానం చేసే ఈ ఉత్పత్తిని కేవలం పోషణ అందించడం మాత్రమే కాకుండా గజిబిజి కాకుండా ఆరోగ్యమూ మెరుగుపరిచే రీతిలో ఉంటుంది.

జెంటిల్‌మెన్స్‌ క్రూ ఆర్గాన్‌ మరియు టీ ట్రీ అలా్ట్ర గ్రోత్‌ బియర్డ్‌ ఆయిల్‌ : ఇది అలా్ట్ర లైట్‌ ఆయిల్‌. పేటెంటెడ్‌ రూట్‌ బయోటెక్‌ కలిగి ఉండటం వల్ల జుట్టు నష్టపోకుండానే ప్యాచ్‌లు పడకుండా కాపాడుతుంది. ఇది 100% సహజసిద్ధమైన నూనె కలిగి ఉండటం తో పాటుగా 15 సహజసిద్ధమైన కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్స్‌ కలిగి ఉంటుంది. దీని కారణంగా 30 రోజులలో జుట్టు ఎదగడంతో పాటుగా మాయిశ్చరైజింగ్‌ కూడా అవుతుంది.

హెయిర్‌ స్టైలింగ్‌ శ్రేణి :

జెంటిల్‌మెన్స్‌ క్రూ ఆర్గాన్‌ మరియు టీ ట్రీ అలా్ట్ర హోల్డ్‌ హెయిర్‌ వ్యాక్స్‌ – మీ జుట్టుకు మరింత వాల్యూమ్‌ మరియు టెక్చర్‌ను ఆర్గాన్‌ మరియు టీ ట్రీ అలా్ట్ర హోల్డ్‌ హెయిర్‌ వ్యాక్స్‌తో మిళితం చేయండి. ఈ హెయిర్‌ వ్యాక్స్‌ తో కేవలం 90 సెకన్లలో జుట్టు స్టైలింగ్‌ చేసుకోవడం సాధ్యం కావడంతో పాటుగా జుట్టు బలం పరంగా ఎలాంటి నష్టమూ కలిగించదు. ఈ ఫార్ములా తో జుట్టు ఎలాంటి జిడ్డు లేకుండా 8 గంటలు నిలిచి ఉంటుంది. దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మరియు ఆలోవెరా ఉంటాయి. ఇవి జుట్టుకు బలం చేకూర్చడంతో పాటుగా మాయిశ్చరైజ్‌ చేస్తాయి.

జెంటిల్‌మెన్స్‌ క్రూ ఆర్గాన్‌ మరియు టీ ట్రీ అలా్ట్ర నరిష్‌ హెయిర్‌ క్రీమ్‌ – ఈ అలా్ట్ర నరిష్‌ హెయిర్‌ క్రీమ్‌ రోజంతటకీ సుదీర్ఘమైన వాల్యూమ్‌ బూస్ట్‌ అందిస్తుంది. ఈ ఉత్పత్తిలో ఆర్గాన్‌, టీ ట్రీ , విటమిన్‌ ఈ ఉంటాయి. ఇది జుట్టు తంతువులు, స్కాల్ప్‌, మూలాలపై పనిచేస్తుంది. తద్వారా ట్రిపుల్‌ యాక్షన్‌ పోషణను ఇది అందిస్తుంది.

డియోడరెంట్‌ శ్రేణి

వైల్డ్‌ డిజైర్‌ : డేట్‌ నైట్‌ లేదంటే డిన్నర్‌ పార్టీల కోసం సాహసోపేత మరియు సువాసలను కలిగించే ఫ్రాగ్నాన్స్‌.

ఓషన్‌ ఎస్కేప్‌ : ఫ్రెష్‌ ఆక్వా ఫ్రాగ్నాన్స్‌. పగటి పూట కార్యకలాపాలలో నిమగ్నమైన వారికి ఇది చక్కగా సరిపోతుంది. క్రిస్ప్‌ ఆక్వాటిక్‌ నోట్స్‌ తక్షణమే మిమ్మల్ని అత్యంత ఆహ్లాదకరమైన నీలి సముద్రంలోకి తోడ్కని పోతుంది.

స్పోర్ట్స్‌ ఎడిక్ట్‌ : ముడి, శక్తివంతమైన ఫ్రాగ్నాన్స్‌. శక్తివంతమైన నోట్స్‌ యొక్క సాహసోపేత కూర్పు ప్రతి రోజూ కొత్త లక్ష్యాలను సాధించడానికి మీ శక్తిని పంపింగ్‌ చేస్తుంది.

మీ గ్రూమింగ్‌ ప్రయాణం ఇక్కడ ఆరంభించండి

జెంటిల్‌మెన్స్‌ క్రూ డియోడరెంట్స్‌, ఆర్గాన్‌, టీ ట్రీ బియర్డ్‌, హెయిర్‌ శ్రేణి నైకా డాట్‌ కామ్‌ (Nykaa.com ), నైకా స్టోర్ల వద్ద భారతదేశ వ్యాప్తంగా లభ్యమవుతాయి. వీటి ధరలు 349 రూపాయల నుంచి 449 రూపాయల మధ్య ఉంటాయి. ఈ శ్రేణి పూర్తి గా హింస లేనట్టివి. అలాగే పారాబెన్‌ ఫ్రీ, వీగన్‌ ఉత్పత్తులు. వీటిలో 100% నేచురల్‌ యాకివ్స్‌ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News