Monday, November 18, 2024

జోషిమఠ్ భూ క్షీణతపై హైదరాబాద్ భూభౌతిక శాస్త్రవేత్తల అధ్యయనం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి(సిఎస్‌ఆర్‌ఐ) కు చెందిన జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జిఆర్‌ఐ)కు చెందిన నిపుణుల బృందం ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌కు బయలుదేరుతున్నది. జోషిమఠ్‌లో ఇటీవల భూమి కుంగగా చాలా మంది నిర్వాసితులయ్యారన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బయలుదేరే భూభౌతిక శాస్త్రజ్ఞులు జోషిమఠ్ ఉపరితల ఫిజికల్ మ్యాపింగ్ నిర్వహించనున్నారని ఓ సీనియర్ శాస్త్రజ్ఞుడు తెలిపారు.

ఈ శాస్త్రవేత్తల బృందానికి ఎన్‌జిఆర్‌ఐకు చెందిన ప్రధాన శాస్త్రజ్ఞుడు ఆనంద్ కె. పాండే నేతృత్వం వహించనున్నారు. ఈ బృందం జనవరి 13న అక్కడికి చేరుకుని అదే రోజున పని మొదలు పెట్టనున్నదని తెలిసింది. వారు అక్కడ రెండు వారాల పాటు భూ పరీక్షలు నిర్వహించనున్నారు. భూమి ఎందుకు కుంగుతున్నదన్నది తెలుసుకోడానికి కారణాలను విశ్లేషించనున్నది.

జోషిమఠ్ ప్రధాన తీర్థస్థలాలు అయిన బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్, అంతర్జాతీయ స్కీయింగ్ ప్రదేశం ‘ఔలి’లకు గేట్‌వేగా ఉంది. అయితే జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడం పెద్ద సవాలుగా మారింది. ‘మా పరికరాలు అక్కడికి చేరకుంటున్నాయి. జనవరి 13 నాటికి మా మొత్తం బృందం జోషిమఠ్‌లో ఉండగలదు. జనవరి 14 నుంచి మేము రెండు వారాల పాటు అక్కడ భూ సర్వే నిర్వహించనున్నాము. మేము నీటి సంతృప్త, నేల లక్షణాల కోసం నిస్సార ఉపరితల భౌతిక మ్యాపింగ్ చేయాలనుకుంటున్నాము’ అని పాండే పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

Hyderabad geophysical scientists

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News