Monday, December 23, 2024

గుండెపోటుతో రింగ్‌లోనే బాక్సర్ మృతి

- Advertisement -
- Advertisement -

German Boxer Dies Of Heart Attack Mid Fight

మ్యూనిచ్ (జర్మనీ): గుండెపోటుతో ఓ స్టార్ బాక్సర్ రింగ్‌లోనే మృతి చెందిన విషాద సంఘటన క్రీడాభిమానులను కలచి వేసింది. మ్యూనిచ్ నగరంలో జరిగిన ఓ బాక్సింగ్ టోర్నమెంట్‌లో జర్మనీకి చెందిన మూసా యమక్ (38) బరిలోకి దిగాడు. ఉగాండకు చెందిన హమ్జా వాండెరతో మూసా తలపడ్డాడు. కాగా, రెండో రౌండ్‌లో ప్రత్యర్థి హమ్జా జర్మనీ బాక్సర్ మూసాపై అనూహ్యంగా విరుచుకుపడ్డాడు. హమ్జా కొట్టిన పిడిగుద్దులకు తాళలేక మూసా రింగ్‌లోనే కుప్పకూలాడు. దీంతో అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మూసా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, మూసా యూరప్, ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్స్ గెలిచి సత్తా చాటాడు. ఇక అతను అకాల మరణంపై తోటి బాక్సర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News