బెర్లిన్: జర్మనీ కంపెనీ CAMDOM అనే ఓ డిజిటల్ కండోమ్ యాప్ ను ఆవిష్కరించింది. ఇదో వినూత్న యాప్. జర్మనీకి చెందిన బ్రాండ్ బిల్లీ బాయ్ దీన్ని ఆవిష్కరించింది. ఎవరైనా మనకు తెలియకుండా మన లైంగిక కార్యకలాపాలను రికార్డు చేయకుండా ఇది రక్షిస్తుంది. రికార్డు చేసే కెమెరాలు, మైక్రోఫోన్లు పనిచేయకుండా చేసేందుకు ఈ యాప్ బ్లూటూత్ వాడుతుంది. అనుమతి లేకుండా ఎవరూ లైంగిక కార్యకలాపాలను రికార్డు చేయకుండా ఇది కాపాడుతుంది.
సెక్సువల్ హెల్త్ అవేర్ నెస్ మంత్ సందర్భంగా ఈ యాప్ ను జర్మనీ కంపెనీ ఆవిష్కరించింది. నేటి డిజిటల్ యుగంలో ఓ రకమైన భద్రతను ఇది కాపాడుతుంది.ఈ digital condomను(CAMDOM) ఉపయోగించడం చాలా సులభం. జంట తమ ఫోన్లలో ఈ యాప్ ను స్వైప్ డౌన్ చేస్తే సరి. కెమెరాలు, మైక్రోఫోన్లు లాక్ అయిపోతాయి. ఒకవేళ ఎవరైనా మధ్యలో లాక్ ను డిసేబుల్ చేయాలనుకుంటే అలారమ్ మోగుతుంది. దాంతో రహస్యంగా రికార్డింగ్ చేయబూనడాన్ని ఆపేయవచ్చు. ఈ యాప్ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎక్కడైనా ఉపయోగించొచ్చు. బిల్లీ బాయ్, ఇన్నోసియన్ బెర్లిన్ ఈ CAMDOM యాప్ ను డెవలప్ చేశాయి.