Tuesday, January 21, 2025

మాంద్యంలోకి జర్మనీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ మాంద్యంలోకి జారుకుంటోంది. వరుసగా రెండో త్రైమాసికంలో దేశీయ జిడిపి పడిపోయిందని జర్మని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా గ్యాస్ సరఫరా నిలిచిపోవడం వల్ల జర్మనీపై తీవ్ర ప్రభావం పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. మాంద్యంలోకి జారుకున్నట్టు జర్మనీ ప్రభుత్వం నిర్థారించింది.

జర్మనీ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) జనవరిమార్చి 0.3 శాతానికి క్షీణించింది. అంతకుముందు మూడు నెలల కాలంలో ఇది 0.5 శాతం క్షీణతతో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జర్మనీ ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్ 7.2 శాతానికి చేరింది. డాలర్ విలువ రెండు నెలల గరిష్ఠానికి చేరుకుంది. తాజాగా రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అమెరికా ‘ఎఎఎ’ డెబిట్ రేటింగ్ నెగెటివ్ పరిశీలనలో ఉంది. చట్టసభ సభ్యుల నుంచి రుణ పరిమితి పెంపునకు అనుమతి పొందడంలో విఫలమైతే డౌన్‌గ్రేడ్ అవకాశముందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News