లాగోస్: ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ తమ బందీగా చేసుకుని గాజాకు తీసుకెళ్లి అక్కడ వీధుల్లో నగ్నంగా ఊరేగించిన జర్మన్-ఇజ్రాయెలీ మహిళ మహిళ షానీ లౌక్ శవమై కనిపించింది. షాని మరణించిన విషాద వార్తను ఆమె సోదరి ఆది లౌక్ సోషల్ మీడియాలో వెల్లడించారు. 23 ఏళ్ల షాని లౌక్‌ను బందీ చేసుకున్న హమాస్ ఆమెను గాజాకు తీసుకెళ్లి ట్రక్కులో నగ్నంగా ఊరేగించింది. చేతి మీద టాటూలు, డై చేసిన ఆమె జుత్తుతో ప్రత్యేకంగా కనిపించే తన కుమార్తెను వీడియోలో ముందుగా చూసిన షానీ తల్లి రిచర్డ లౌక్ .ఆమె భద్రతపై ఆందోళన చెందారు.
బందీగా చేసుకున్న అనంతరం షానీని ఒక పికప్ ట్రక్కులో నగ్నంగా ఊరేగించిన హమాస్ సాయుధులు ఊరేగించిన దృశ్యాలతో కూడిన వీడియోలు ఇంటర్‌నెట్‌లో సంచలనం సృష్టించాయి. ఆ వీడియోలో తలవంచుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న షానీ కనిపించింది. షానీ లౌక్ అప్పుడే మరణించినప్పటికీ ఆమె జీవించే ఉందన్న ఆశతో ఆమె కుటుంబం ఇప్పటివరకు ఉంది.
షానీ లౌక కుటంబానికి ఇజ్రాయెలీ జాకా రిస్కూ సర్వీసు నుంచి ఆదివారం రాత్రి ఒక లేఖ అందినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. షానీ కపాలం నుంచి ఒక ఎముకను సేకరించి జన్యుపరీక్షలు నిర్వహించి ఆమె షానీనే అని నిర్ధారించినట్లు ఆ లేఖలో తెలిపింది.
ఇజ్రాజెల్‌లో జరుగుతున్న ఒక సంగీత ఉత్సవం నుంచి షానీని కిడ్నాప్ చేసిన హమాస్ ఉగ్రవాదులు ఆమె చిత్రహింసలకు గురిచేసి గాజాలో ఊరేగించారని, ఆమె అనుభవించిన భయానక పరిస్థితికి తమ హృదయాలు ముక్కలైందని ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ ప్రకటించింది.
జర్మన్-ఇజ్రాయెలీ మహిళ షానీ లౌక్ మరణం హమాస్ ఆటవికతకు అద్దం పడుతుందని జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ సోమవారం పేర్కొన్నారు. పాలస్తీనాకు చెందిన ఈ ఉగ్రవాద సంస్థే ఇందుకు బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
షానీ లౌక్ మరణాన్ని ఇజ్రాయెలీ ప్రభుత్వం సోమవారం ధ్రువీకరించింది. అక్టోబర్ 7న ఒక సంగీత ఉత్సవంపై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు 1,400 మందిని హతమార్చారని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షానీ లౌక్ కిడ్నాప్ కావడానికి ముందు అందులో నృత్యం చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.