Thursday, April 3, 2025

జర్మనీ యువతిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

లిఫ్ట్ ఇస్తానంటూ దారుణం
నిందితుడిని అరెస్టు చేసిన
పోలీసులు హైదరాబాద్
పాతబస్తీలో ఘటన

మన తెలంగాణ/పహడిషరీఫ్: నగర శివారు ప్రాంతమైన పహాడిషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తన మిత్రుని కలిసేందుకు జర్మనీ దేశం నుంచి వచ్చిన యువతిపై ఓ కారు డ్రైవర్ ఆత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి నిందుతుడి అదుపులో తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం… నగరానికి చెందిన యువకుడు జర్మనీలో విద్యాను అభ్యసించాడు. మిత్రుడి కలిసేందుకు వారం రోజుల క్రితం జర్మనీకి చెందిన యువతి హైదరాబాద్‌కు వచ్చింది. సోమవారం స్నేహితులతో కలిసి పలు ప్రాంతాలు సందర్శించింది. స్నేహితులను డ్రాప్ చేసి విమానాశ్రయానికి వెలుతుండగా కారు డ్రైవర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మామిడిపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత యువతి 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసుల ప్రత్యేక బృందాలు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.అంతర్జాతీయ ఘటన కావడంతో పోలీసులు వివరాలు వెల్లడించడంలో గోప్యత పాటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News