న్యూఢిల్లీ: ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటునాటు’కు జర్మన్ అంబాసిడర్ ఫిలిప్ అకర్‌మాన్ డ్యాన్స్ చేయడంపై ప్రధానిమోడీ ప్రశంసల వర్షం కురిపించారు. జర్మనీ రాయబారి తన సిబ్బందితో కలిసి చాందినిచౌక్‌లో నాటునాటు పాటక స్ట్రీట్ డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా అకర్‌మాన్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘జర్మన్లు డ్యాన్స్ చేయలేరా?’ పాత ఢిల్లీలో తను, ఇండో జర్మన్ టీమ్ కలిసి ఆస్కార్ 95 విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నామని తెలిపారు. డ్యాన్స్ అంత పర్ఫెక్ట్‌గా లేకపోయినా సంతోషంగా ఉంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందిస్తూ భారతదేశపు రంగులు, రుచులను ఆస్వాదించే జర్మన్లు బాగా డ్యాన్స్ చేస్తారంటూ కితాబిచ్చారు. కాగా ప్రముఖ టాలీవడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి రూపొందించిన పిరియాడికల్ మూవీ సినీ ప్రపంచంలో చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ విజేతగా నిలిచి ఈఘనత సాధించిన తొలి ఇండియన్ ట్రాక్‌గా రికార్డు సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రచించగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.
#NatuNatu #Oscar #Fever #German #Germany #Ambassador #Embassy #team in #India #Dance to the #tune of #RRRMoive #RRRWinsOscar #Original #song @GermanyinIndia @AmbAckermann #RRR https://t.co/55hXYgindc
— Vishal Burman (@burman_vishal) March 19, 2023