- Advertisement -
బెర్లిన్ : భారత్ లోని ఆస్పత్రులు కరోనా కేసులతో అల్లాడుతుండడంపై జర్మనీ స్పందించి అత్యవసర వైద్య సహాయం అందించడానికి సిద్ధం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో మొబైల్ ఆక్సిజన్ జెనరేటర్, ఇతర వైద్యసాయం అందించడానికి సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నట్టు జర్మనీ రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అంతకు ముందే భారత ప్రజలకు తన సానుభూతి తెలియచేస్తూ సహాయం చేయడానికి అత్యవసర మిషన్‌ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. కరోనా విలయంలో జర్మనీ మిలిటరీ ఇతర దేశాలకు, అంతర్జాతీయ సంస్థలకు 38 సహాయ మిషన్లను నిర్వహించింది.
- Advertisement -