Monday, December 23, 2024

ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న జర్మనీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచంలో అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. దీంతో యూరోపియన్ యూనియన్ కరెన్సీ యూరో విలువ గురువారం పతనమైంది. అదే సమయంలో అమెరికన్ డాలర్ విలువ రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. అమెరికా డిఫాల్ట్ అవుతుందనే ఆందోళన పెరుగుతున్న సమయంలో సేఫ్-హెవెన్ డిమాండ్ వల్ల లబ్ధి పొందింది.

రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ (Fitch) తాజా ఆందోళనను లేవనెత్తింది. అమెరికాకు చెందిన “AAA” డెట్ రేటింగ్స్‌ను నెగెటివ్ వాచ్‌లో పెట్టింది. రుణ పరిమితిని పెంచడానికి చట్టసభల సభ్యులు అంగీకరించకపోతే, డెట్ రేటింగ్స్ మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. రుణ పరిమితికి సంబంధించిన చర్చల గడువు జూన్ 1తో ముగుస్తుంది. ఈ చర్చలు సఫలం కాకపోతే అన్ని బిల్లులను పూర్తిగా చెల్లించడం అసాధ్యమని ట్రెజరీ హెచ్చరించింది. ఈ గడువు ఇక ఓ వారం మాత్రమే ఉండటంతో సేఫ్ హెవెన్స్ కోసం డిమాండ్ పెరుగుతోంది. దీనివల్ల అమెరికన్ డాలర్ ప్రయోజనం పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News