Monday, December 23, 2024

కారు దిగి కమలంలోకి..

- Advertisement -
- Advertisement -

బిజెపిలో చేరిన మాజీ ఎంపిలు సీతారాం నాయక్, నగేష్, మాజీ ఎంఎల్‌ఎలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు

త్వరలో ఎంపి అభ్యర్థులుగా ప్రకటించే ఛాన్స్

మన తెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నిక లు సమీపిస్తుండటంతో కమలనాథులు ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచారు. ఇప్పటికే 9 స్ధానాలకు ఎంపి అభ్యర్ధులు ప్రకటించి ఆపార్టీ మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చే స్తుంది. అందులో భాగంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ పార్టీలో చేర్చుకుంటుంది. ఆదివారం మాజీ ఎంపిలు సీతారాం నాయక్, గోడం నగేశ్ , మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూ డి సైదిరెడ్డి కమలం పార్టీలో చేరారు. వీరంతా దిల్లీ లో తరుణ్‌చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. వీరికి త్వరలో ప్రకటించే రెండో జాబితాలో ఎంపిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ప్రచారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News