Wednesday, January 22, 2025

బురఖా ధరించినందుకు కాలేజినుంచి వెలి!

- Advertisement -
- Advertisement -
Get out of college for wearing burqa
కర్నాటక ఉడుపి జిల్లా జూనియర్ కాలేజిలో ఘటన

బెంగళూరు: కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపూర్ పట్టణంలోని ఓ కాలేజిలో విద్యార్థ్థినులు బురఖా ధరించినందుకు కాలేజి అధికారులు వారిని తరగతులకు అనుమతించని సంఘటన ఒకటి వెలుగులోని వచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని ఓ ప్రీ యూనివర్సిటీ కాలేజి (జూనియర్ కాలేజి)లో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థునులు తమను తరగతులకు అనుమతించాలంటూప్రిన్సిపాల్‌ను వేడుకొంటున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. పరీక్షలు కేవలం రెండు నెలలే ఉన్నాయని, ఈ పరిస్థితుల్ల్లో కాలేజి అధికారులు బురఖాను ఎందుకు సమస్య చేస్తున్నారని వారు ఆయనను ప్రశ్నించడం కూడా ఆ వీడియోలో ఉంది. ఇప్పటివరకు కాలేజికి విద్యార్థినులు బురఖా ధరించి వచ్చినప్పటికీ తరగతి గదిలో దాన్ని తీసేయడం ఆనవాయితీగా ఉంటోది. కాగా తదుపరి నిర్ణయం తీసుకునే దాకా యథాతథ స్థితిని కొనసాగించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్ అంగార చెప్పారు.

జిల్లా యంత్రాంగంతో చర్చలు జరిపిన తర్వాత దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొంటుందని, దీనికి సంబంధించిన అన్ని వర్గాలతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. బుధవారం కొంత మంది విద్యార్థినులు బురఖా ధరించి కాలేజికి రావడంతో సమస్య మొదలైంది. ఇది చూసి దాదాపు వందమంది విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. కాలేజి అధికారులు కుందాపూర్ ఎంఎల్‌ఎ హలది శ్రీనివాస్ శెట్టితో చర్చలు జరిపాక విద్యార్థులు యూనిఫామ్ నిబంధనకు కట్టుబడి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే అమ్మాయిలు తమను బురఖాతో తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టడంతో వారిని కాలేజిలోకి రానివ్వలేదు. కాగా కర్నాటకలో గత రెండు నెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. నెల రోజుల క్రితం ఉడుపిలోని ఓ బాలికల కళాశాలలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ గొడవ ఇంకా సద్దుమణగలేదు. తరగతి గదిలో తమకు బురఖా లేదా స్కార్ఫ్ ధరించడానికి అనుమతించేలా చూడాలంటూ ఓ విద్యార్థిని ఏకంగా హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News